Page Loader
Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ నటి మాధవీలత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్)కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కి ఆమె ఈ ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై, సినీ పరిశ్రమ స్పందించకపోవడం ఆమెకు అసంతృప్తిని కలిగించింది. మాధవీలత చెప్పినదానిని ప్రస్తావిస్తూ, "ప్రభాకర్‌ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని, సినిమా పరిశ్రమలో సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన క్షమాపణలు చెప్పినా సరిపోదని, తాను ఆయనపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.

Details

న్యాయం కోసం పోరాటం చేస్తా

ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదన్నారు. అందుకే ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు చేస్తున్నానని ఆమె వివరించారు. ఫిర్యాదు చేసే ముందు, మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 'న్యాయం కోసం నా పోరాటం'అనే సందేశం పెట్టారు.