
Family Star: ఫ్యామిలీ స్టార్ నుండి 'మధురము కదా' సాంగ్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ,బాలీవుడ్ స్టార్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్.
ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.
హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ "మధురము కదా" అనే కొత్త సింగిల్‌ని ఆవిష్కరించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటను, శ్రియా ఘోషల్ పాడింది.
అదేకాకుండా, ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 28 వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Details
అతిధి పాత్రలో రష్మిక మందన్న
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు కీలక పాత్రలలో నటిస్తుండగా రష్మిక మందన్న ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం,హిందీ భాషల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్
Being in love is a sweet feeling. Being loved, is the sweetest ❤️#FamilyStar Third Single #MadhuramuKadha out now ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) March 25, 2024
🎶 https://t.co/WusptTRWix
In the lovely voice of @shreyaghoshal ✨#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan…