తదుపరి వార్తా కథనం
Maha Kumbh Girl Monalisa: మహా కుంభ మోనాలిసా టాలీవుడ్ ఎంట్రీ .. మూవీ లాంచ్ ఈవెంట్‌లో సందడి
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 05, 2025
04:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలను అమ్ముతూ అక్కడి సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా స్టార్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగుపెట్టింది. ఓ తెలుగు చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ మూవీ లాంచ్ ఈవెంట్‌లో సందడి చేసింది. అక్కడి నుంచి వచ్చిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వర్ధమాన నటుడు సాయి చరణ్ హీరోగా దర్శకుడు శ్రీను కోటపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనే ప్రణాళికతో చిత్రబృందం ముందుకు వెళ్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోనాలిసా(పూసలమ్మాయి) న్యూ మూవీ లాంచ్
మోనాలిసా(పూసలమ్మాయి) న్యూ మూవీ లాంచ్ #Monalisamahakumbh #NTVENT pic.twitter.com/XPoWQW1CWk
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) November 5, 2025