
HBD Mahanati Savitri : హ్యాపీ బర్త్ డే మహానటి సావిత్రి.. మద్రాసులో ఆమె కారు వస్తుందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అలనాటి తార సావిత్రి అంటే తెలియని వారు ఉండరమో. ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు.
కథా బలమున్న సినిమాల్లో నటించి మెప్పించి మహానటిగా మారారు. ఇవాళ సావిత్రి 88వ జయంతి.
మానవత్వంతో మరెంతో మందికి సాయం అందించారు.నటనపై ఈ మహానటికి ఉన్న గౌరవం ఆమెను వెండితెరపై చిరస్థాయిగా మిగిలేలా చేసింది.
ఆ రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి అలరించారు. అందం,అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు.
13ఏళ్లలోనే కాకినాడ ఆంధ్రనాటిక పరిషత్ నిర్వహించిన నాటక పోటీల్లో అద్భుతమైన నటన కనబరిచారు.
ఈ మేరకు బాలీవుడ్ ప్రముఖ నటుడు పృధ్వీరాజ్ కపూర్ ఆమెకు బహుమతి అందిస్తూ భవిష్యత్ లో మహానటి అవుతావని చెప్పారట.
DETAILS
1950లో సంసారంతో వెండితెర జీవితం ప్రారంభం
సినిమాల్లో నటించాలని సావిత్రి మద్రాసుకు వెళ్లారు. 1950లో విడుదలైన 'సంసారం' సినిమాతో నటిగా వెండితెరపై తొలిసారి కనిపించారు.
ఆపై 'పాతళ భైరవి'తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. చిన్న పాత్రల్లో నటించిన 'పెళ్లి చేసి చూడు చిత్రం' ద్వారా పేరు సంపాదించారు.
'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్' వంటి మూవీలు సావిత్రికి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిపెట్టాయి. 1954లో విడుదలైన 'బహుత్ దిన్ హుయే' హిందీ సినిమా ద్వారా సావిత్రి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
'దొంగ రాముడు', 'అర్థాంగి', 'మూగ మనసులు', 'మంచి మనసులు', 'తోడికోడళ్ళు', 'ఆత్మ బంధువు', 'రక్త సంబంధం', 'గుండమ్మ కథ' లాంటివి సావిత్రి సినీ జీవితంలో సూపర్ హిట్ అయ్యాయి.
తాను నటించిన సినిమాల్లోకి 'చివరికి మిగిలేది' చాలా ఇష్టమైన సినిమా.
DETAILS
2011లో కేంద్రం పోస్టల్ స్టాంప్ రిలీజ్
1975లో విడుదలైన 'ఏక్ చిట్టీ ప్యార్ భరీ' హిందీ సినిమాకు సావిత్రి నిర్మాతగా కొనసాగారు. నటిగానే కాకుండా దర్శకురాలిగానూ సావిత్రి పలు సినిమాలను తీశారు.
చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం' (తమిళ్), మాతృ దేవత,చిరంజీవి, వింత సంసారం, తమిళలంలో ప్రాప్తం సినిమాలను సావిత్ర డెరెక్ట్ చేశారు.
1966లో విడుదలైన నవరాత్రిలో నేపథ్య గాయనిగానూ మహానటి పాటలు ఆలపించారు.
దేవదాసు,'చివరకు మిగిలేది,మాయాబజార్,ఆరాధన,మరో ప్రపంచం' సినిమాలో నటించిన సావిత్రి ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.
చిన్నారి పాప' సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది.2011లో సావిత్రిసేవలకు కేంద్రం ఆమె ఫోటోతో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది.
మద్రాస్ రోడ్లపై సావిత్రి కారు హారన్ విని ఆమె కారుకు దారి ఇచ్చేవారట.