Mahesh Babu, Ram Charan: బొమ్మ అదుర్స్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబాలు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.
రెండు కుటుంబాలు అప్పుడప్పుడు కలుస్తుంటాయి. తాజాగా ఈ రెండు కుటుంబాలు ఒక ప్రైవేట్ పార్టీలో కలిశాయి.
ఈ పార్టీలో మహేష్, చరణ్‌లతో పాటు ఉపాసన, నమ్రత, కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫొటో బయటకు వచ్చింది. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.
రామ్ చరణ్ ప్రైవేట్ పార్టీల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. కానీ మహేష్ బాబు ప్రైవేట్ పార్టీల్లో కనపడటం చాలా అరుదు.
ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇద్దరి మధ్య బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో ఇదే
Pre-Diwali celebrations are brighter when family gathers 🪔✨
— Galatta Media (@galattadotcom) November 5, 2023
Mahesh Babu, Ram Charan, Venkatesh Daggubati, and their loved ones making this festive season even more special 🎉👨👩👦👦@urstrulyMahesh @VenkyMama @AlwaysRamCharan @upasanakonidela #Ramcharan #MaheshBabu… pic.twitter.com/9Z3AjCT7ZA