Super Star Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు.. ఆ విషయంలో మహేశ్ బాబు స్థాయే వేరు!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అంటే అభిమానులకు పండగే. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వారణాసి' నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా కథ ఎలా ఉన్నా.. మహేశ్ బర్త్‌డే సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు మాత్రం చోటుచేసుకున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏటా ఏదో ఒక స్పెషల్ ఉండటం అభిమానులకు ఆనందాన్ని పంచుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన నటించిన పాత సినిమాలను బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజ్ చేయడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈసారి మహేశ్ బర్త్‌డే సందర్భంగా 2011లో వచ్చిన బంపర్ హిట్ మూవీ 'దూకుడు' రీ-రిలీజ్ అవుతోంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
వివరాలు
శ్రీరాముడి గెటప్‌లో మహేష్..
ఇదే సమయంలో 'వారణాసి' నుంచి మహేశ్‌కు సంబంధించిన గ్లింప్స్ లేదా స్టిల్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇందులో శ్రీరాముడి గెటప్‌లో మహేశ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆ లుక్‌ను విడుదల చేస్తే.. సందడి మరో లెవెల్‌లో ఉంటుందని అభిమానులు అంటున్నారు.
నటవారసుల్లో మహేశ్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తండ్రి నటశేఖర కృష్ణతో పోలిస్తే మరింత మెరుగైన సక్సెస్ రేటుతో మహేశ్ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
కృష్ణకు ఉత్తమ నటుడిగా ప్రభుత్వ అవార్డులు దక్కకపోయినా.. మహేశ్ మాత్రం ఇప్పటివరకు నాలుగు సార్లు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డులు అందుకున్నారు.
నటవారసుల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా మహేశ్ నిలిచారు.
వివరాలు
120కి పైగా భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో విడుదల..
మహేశ్ బాబు తొలిసారి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి'లో నటిస్తున్నారు.
ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాల ద్వారా పలువురు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చారు.
అయితే తొలిసారి ఓ సూపర్ స్టార్‌తో కలిసి ఆయన పనిచేస్తుండటం 'వారణాసి'పై అంచనాలను మరింత పెంచింది.
మహేశ్ బాబుతో సినిమా అనగానే రాజమౌళి కూడా 'వారణాసి'ని ఓ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిర్మాతలు కార్తికేయ, కె.ఎల్. నారాయణ కూడా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి' నిలిచిందని సమాచారం.
అంతేకాదు.. మూడు యుగాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటం మరో ప్రత్యేకత.
120కి పైగా భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.