Varanasi: 'వారణాసి' అప్‌డేట్.. రుద్రగా మహేశ్ బాబు.. ఫస్ట్‌లుక్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి' (Varanasi). మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 'రుద్ర' పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు'' అనే క్యాప్షన్‌ను జత చేశారు. 'రుద్ర' అంటే సాధారణంగా తీవ్రమైన కోపం, మాస్ యాక్షన్, భీకరమైన రూపం గుర్తుకొస్తాయి. అయితే రాజమౌళి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ చూస్తే.. ఈ పాత్రలో కేవలం కోపం మాత్రమే కాకుండా ప్రశాంతత, లోతైన ఆలోచనలు వంటి విభిన్నమైన షేడ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు..
ఇప్పటివరకు క్లాస్, హ్యాండ్సమ్ లుక్స్‌లో ఎక్కువగా కనిపించిన మహేశ్ బాబు.. ఈ ఫొటోల్లో మాత్రం ఒత్తైన జుట్టు, గడ్డం, మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంతో పాటు కాలాలను కూడా చుట్టేసే ఓ సాహసికుడి కథగా 'వారణాసి' తెరకెక్కుతోంది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి.. అనంతరం సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
వివరాలు
శుభాకాంక్షల వెల్లువ..
ఇక మహేశ్ బాబు కూడా 'రుద్ర ప్రపంచం నుంచి మీకోసం ఓ చిన్న సర్‌ప్రైజ్' అంటూ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
''మహేశ్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ పంచే ప్రేమ, నింపే అపరిమితమైన శక్తి, అభిమానులకు మీరు ఇచ్చే ఉత్సాహం.. ఇవన్నీ గొప్ప విషయాలే.
'వారణాసి' అద్భుతాల ప్రపంచంలోకి స్వాగతం'' అంటూ దుర్గా ఆర్ట్స్ మహేశ్ బాబుకు విషెస్ తెలిపింది.