జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్‌గా మారిపోతున్నారు. 47ఏళ్ళ వయసులోనూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ యవ్వనంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు మహేష్. అయితే తాజాగా జిమ్ లో మహేష్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గ్రే కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్స్ లో మహేష్ హెవీగా వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను తన ఇన్స్ టా ఖాతాలో పోస్ట్ చేసారు. త్రివిక్రమ్ సినిమా పూర్తవగానే రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లెవెల్లో సినిమాను చేస్తున్నారు మహేష్. ఈ సినిమా ప్రకటన మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఉండనుందని అంటున్నారు.