మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోస్.. హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానుల కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోవర్ల కోసం అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో మహేష్ బాబు పంచుకుంటారు.
తాజాగా అలాంటి ఫోటోలను మహేష్ బాబు షేర్ చేశారు. హలో మ్యాగజైన్ కోసం మహేష్ బాబు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలో మహేష్ బాబు లుక్ చాలా కొత్తగా ఉంది.
వివిధ రకాల డ్రెస్సుల్లో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందరూ హాలీవుడ్ హీరో మాదిరిగా మహేష్ బాబు ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Details
మహేష్ బాబు ఫోటోలపై నమ్రత కామెంట్స్
మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలపై ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని హలో హాటీ అంటూ కామెంట్ తో స్పందించారు.
అదలా ఉంచితే, మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా నుండి దసరా కానుకగా ఒకానొక పాటను రిలీజ్ చేయబోతున్నారు.
గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నారు.