Darshan Posani : జూనియర్ ప్రభాస్‌గా స్క్రీన్‌పై మెరుస్తున్న మహేశ్ బాబు మేనల్లుడు!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు కుమారులు సినీ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. పెద్ద కుమారుడు చరిత్ మానస్ "భలే భలే మగాడివోయ్" సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చరిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఇక సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ , ఇప్పటికే అడివి శేష్ నటించిన గూఢచారిలో, అలాగే మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాటలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. దర్శన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
Details
ప్రభాస్ సరసన ఇమాన్వి
ఇప్పుడు దర్శన్ కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగు వేస్తున్నాడు. అతను ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, విభిన్న కథల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఫౌజీ'లో దర్శన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 1930ల కాలం నాటి రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన ఆ కాలపు ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి అనే కొత్త నటి హీరోయిన్‌గా నటిస్తోంది.
Details
అధికారికంగా ధ్రువీకరించిన సుదీర్ బాబు
ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను దర్శన్ పోషించనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్ తండ్రి సుధీర్ బాబు వెల్లడించారు. ఆయన హీరోగా నటించిన జటాధరా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ కీలక అప్డేట్‌ను ప్రకటించారు. తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేశ్ బాబులలా దర్శన్ కూడా రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త తరానికి చెందిన ప్రతిభావంతుడు దర్శన్ ఇప్పుడు నుంచే టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.