Page Loader
Bhaje Vaayu Vegam: కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం'.. టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ఆవిష్కరించిన మహేష్ బాబు
Bhaje Vaayu Vegam: కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం'..

Bhaje Vaayu Vegam: కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం'.. టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ఆవిష్కరించిన మహేష్ బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 12, 2024
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కార్తికేయ కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతను చివరిగా బెదురులంక 2012 చిత్రంలో కనిపించాడు.తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా, కార్తికేయ కొత్త చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి 'భజే వాయు వేగం'అని పేరు పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, కార్తికేయ చేతిలో క్రికెట్ బ్యాట్‌తో పరుగెత్తుతున్న ఫొటోను చూడవచ్చు. మనం బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా కరెన్సీ నోట్లను కూడా చూడవచ్చు.'అతడు తన అదృష్టాన్ని ఛేజ్‌ చేయడానికి పార్క్ నుండి వస్తున్నాడు. మిమ్మల్ని మీ సీట్ల నుంచి లేచి నిలబడేలా చేస్తాడు. రేసీ థ్రిల్లర్ ఇది' అని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

Details 

కార్తికేయ కెరీర్‌లో 8వ చిత్రం

టైటిల్, ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయిక. ఈ చిత్రానికి దర్శకుదిగా ప్రశాంత్ రెడ్డిపరిచయం అవుతున్నారు. 'భజే వాయు వేగం' కార్తికేయ కెరీర్‌లో 8వ చిత్రం. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించబడుతుంది. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాత. 'హ్యాపీడేస్' ఫేమ్ 'రాహుల్' (టైసన్) కీలక పాత్రలో కనిపించనున్నారు. రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యువి క్రియేషన్స్ చేసిన ట్వీట్