LOADING...
Mahesh Babu: వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..
వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..

Mahesh Babu: వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 29, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినీ ప్రయాణంలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మహేష్ బాబును ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చే స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే, మహేష్ తదుపరి సినిమాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

వివరాలు

లుక్ పూర్తిగా మార్చేసిన మహేష్ బాబు

ప్రస్తుతం 'వారణాసి' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో, భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుందని సమాచారం. ఇది కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, పాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అడ్వెంచర్ డ్రామా కోసం మహేష్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు, శారీరకంగా కూడా కఠినంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది.

వివరాలు

టాలీవుడ్ వర్గాల్లో చర్చ..

ఈ క్రమంలో రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందులో ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఆయన తదుపరి చిత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

మరో ఇద్దరు డైరెక్టర్లతో చర్చలు..

గతంలో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', 'సర్కారు వారి పాట' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, ఈసారి కూడా భారీ స్థాయిలో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా ద్వారా మహేష్‌కు వచ్చే అంతర్జాతీయ గుర్తింపును దృష్టిలో పెట్టుకుని, అదే స్థాయిలో కథను రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే కాకుండా, మరో ఇద్దరు స్టార్ దర్శకులతో కూడా మహేష్ బాబు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

వివరాలు

బాక్సాఫీస్ వద్ద మహేష్ ప్రభంజనం..

'వారణాసి' తర్వాత ఎలాంటి విరామం లేకుండా వరుస ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ మూడు సినిమాల వార్త నిజమైతే, రాబోయే ఐదేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు ప్రభంజనం కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం రాజమౌళి ప్రాజెక్ట్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన మహేష్, త్వరలోనే తన భవిష్యత్ లైనప్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement