LOADING...
Rajamouli- Mahesh: రాజమౌళి బర్త్‌డే.. స్పెషల్‌ ఫొటోతో మహేశ్‌ విషెస్‌ 
రాజమౌళి బర్త్‌డే.. స్పెషల్‌ ఫొటోతో మహేశ్‌ విషెస్

Rajamouli- Mahesh: రాజమౌళి బర్త్‌డే.. స్పెషల్‌ ఫొటోతో మహేశ్‌ విషెస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆస్కార్‌ అవార్డుతో తెలుగు సినిమా పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపును అందించిన ఆయన, సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నేడు ఈ జక్కన్నపుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన్ని అభినందిస్తూ శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ అగ్ర నటుడు మహేష్‌ బాబు కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహేష్ బాబు చేసిన ట్వీట్ 

వివరాలు 

ప్రాజెక్ట్‌కి "వారణాసి"టైటిల్

రాజమౌళితో కలిసి దిగిన ఆ ఫోటోను షేర్‌ చేస్తూ మహేష్‌ బాబు"ఇండస్ట్రీలో ఒకే ఒక దర్శకధీరుడు రాజమౌళి.మీరు రూపొందించే ప్రతీ చిత్రం అద్భుతం.మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతుందని ఆశిస్తున్నాము" అని ట్వీట్‌ చేశారు. ఆ ఫోటోలో మహేష్‌ #SSMB29 లోని లుక్‌లో ఉండడంతో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.ప్రస్తుతం మహేష్‌ బాబు,రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న#SSMB29 సినిమా భారీ స్థాయిలో రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి "వారణాసి"అనే టైటిల్‌పై పరిశీలనలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. నవంబర్‌ 16న దీనిని అధికారికంగా ప్రకటించే సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందులో మహేష్‌ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నారు. ఈకథ అమెజాన్ అడవుల నేపథ్యంపై రూపొందించబడనుంది.సినిమాలో పలువురు విదేశీ నటులు పాల్గొననుండగా,చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు,విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.