LOADING...
Mahesh Babu: జార్జియాలో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌లు.. 'వారణాసి' కొత్త షెడ్యూల్ రెడీ
జార్జియాలో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌లు.. 'వారణాసి' కొత్త షెడ్యూల్ రెడీ

Mahesh Babu: జార్జియాలో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌లు.. 'వారణాసి' కొత్త షెడ్యూల్ రెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత కె. ఎల్. నారాయణతో పాటు ఎస్. ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తిచేసి, తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు పయనంకానున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే జార్జియా షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఘట్టాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Details

వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్

ఫాంటసీ మైథలాజికల్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. రుద్రగా, రాముడిగా రెండు భిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. ఇప్పటికే చిత్రంలోని రామాయణం ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కథను విజేంద్ర ప్రసాద్, ఎస్. ఎస్. కాంచి సంయుక్తంగా అందించగా, మాటలను దేవ కట్టా రాశారు. సంగీతాన్ని ఎంఎం. కీరవాణి సమకూర్చగా, ఛాయాగ్రహణాన్ని పివి. ఆనంద్ నిర్వహిస్తున్నారు.

Advertisement