Loading...
MonaLisa: మోనాలిసా ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు
మోనాలిసా ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

MonaLisa: మోనాలిసా ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 10, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళలో తేనె కళ్లతో అందరినీ ఆకట్టుకున్న పూసలు అమ్మే యువతి మోనాలిసా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక్కరోజులోనే ఆమెకు పెద్ద ఎత్తున గుర్తింపు లభించి సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. ఇదే సమయంలో, కొద్ది రోజుల క్రితం ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాహం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

వివరాలు

మోనాలిసా మైనరేనా?

మోనాలిసా వయస్సు గురించి వచ్చిన అనుమానాల నేపథ్యంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) దర్యాప్తు చేపట్టింది.

ఆ విచారణలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది—మోనాలిసా మైనర్ అని తేలింది.

దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై చట్టపరమైన సమస్యలు ప్రారంభమయ్యాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్‌గోన్ జిల్లా మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై పోక్సో చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

NCST ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఆధ్వర్యంలో జరిగిన విచారణలో న్యాయవాది ప్రథమ్ దుబే కీలక వాదనలు వినిపించారు.

మోనాలిసా వయోజనురాలిగా చూపించి పెళ్లి జరిగినప్పటికీ, ఆమె నిజానికి పార్ధి గిరిజన సముదాయానికి చెందిన మైనర్ బాలిక అని ఆయన నిరూపించారు. 2026 మార్చి 17న కమిషన్ ముందు ప్రస్తావించారు.

వివరాలు

72 గంటల్లో ఆధారాలు సేకరణ

అదేవిధంగా ఈ వివాహంలో కేరళకు చెందిన సీపీఐ(ఎం) నాయకులు, అలాగే పీఎఫ్‌ఐ వంటి సంస్థల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి.

ఇది కేవలం వ్యక్తిగత వివాహం కాకుండా, 'లవ్ జిహాద్' అంశాన్ని ఖండించేందుకు ప్రణాళికాబద్ధంగా సృష్టించిన కథనమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహేశ్వర్ ప్రభుత్వ రికార్డులు కూడా మోనాలిసా మైనర్ అనే విషయాన్ని నిర్ధారించాయి.

కమిషన్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు వివిధ ప్రాంతాలను పరిశీలించి, కేవలం 72 గంటల్లోనే అన్ని ఆధారాలను సేకరించి నిజాన్ని బయటపెట్టింది.

ఈ దర్యాప్తును సలహాదారు ప్రకాష్, డైరెక్టర్ పి. కళ్యాణ్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించారు.

మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా మైనర్ అని స్పష్టమైంది.

ADVERTISEMENT

వివరాలు

నకిలీ సర్టిఫికెట్ జారీ..

ఈ విచారణ మొదట కేరళలోని నాయనార్ దేవాలయం నుంచి ప్రారంభమైంది.

అక్కడి అధికారులు ఆధార్ కార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా మోనాలిసా, ఫర్మాన్ వివాహం జరిగినట్లు తెలిపారు.

అయితే, తరువాతి దర్యాప్తులో మోనాలిసా నకిలీ జనన ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి కేరళలోని పూర్ గ్రామ పంచాయతీలో వివాహాన్ని నమోదు చేయించినట్లు బయటపడింది.

ఈ నకిలీ సర్టిఫికెట్ మహేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జారీ అయిందని గుర్తించారు.

వెంటనే మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులు పరిశీలించగా, మోనాలిసా 2009 డిసెంబర్ 30 సాయంత్రం 5:50కు జన్మించినట్లు తేలింది.

ADVERTISEMENT

వివరాలు

తప్పుడు ఆధారాలు చూపించి..

ఈ సమాచారం ప్రకారం, 2026 మార్చి 11న జరిగిన వివాహ సమయానికి ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు, 2 నెలలు, 12 రోజులు మాత్రమే.

ఈ నేపథ్యంలో, తప్పుడు పుట్టిన తేదీ (1-1-2008గా చూపిన) ఆధారంగా గతంలో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని స్థానిక సంస్థలకు సూచించారు.

ఈ పత్రాలు మొత్తం వివాహానికి సంబంధించిన కుట్రను బయటపెట్టాయి.

అదేవిధంగా, మోనాలిసా తల్లిదండ్రులు సమర్పించిన కుల ధృవీకరణ పత్రాలు వారు షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందినవారని నిర్ధారించాయి.

వివరాలు

కఠిన చర్యలు తప్పవా?

ఈ కేసులో నిందితుడు ఫర్మాన్ ఖాన్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, కమిషన్ సూచనల మేరకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

నిందితుడిపై తీవ్రమైన సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలు 'పార్ధి' తెగకు చెందినదిగా గుర్తించబడడంతో అట్రాసిటీ నిరోధక చట్టంలోని నిబంధనలు కూడా వర్తింపజేశారు.

అలాగే కుట్ర, అక్రమ వివాహం వంటి అంశాలపై భారత శిక్షా స్మృతి ప్రకారం కూడా చర్యలు తీసుకుంటున్నారు.

వివరాలు

డీజీపీలకు సమన్లు..

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.

2026 ఏప్రిల్ 22న న్యూఢిల్లీలోని కమిషన్ కార్యాలయానికి హాజరుకావాలని కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలకు సమన్లు జారీ చేశారు.

ఈ కేసులో రాజకీయ, మత సంస్థల పాత్రపై సమగ్ర నివేదికను కేంద్రానికి పంపనున్నారు.

ఈ మైనర్ బాలికకు జరిగిన అన్యాయం, అలాగే కేరళ పోలీస్ వ్యవస్థ, స్థానిక పరిపాలనపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దోషులకు శిక్ష పడే వరకు ఈ కేసును సమగ్రంగా పర్యవేక్షిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.

అదనంగా, ప్రతి మూడు రోజులకు ఒకసారి పురోగతి నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ADVERTISEMENT