LOADING...
Rajasaab: రాజా సాబ్‌ రిలీజ్‌ వాయిదా వార్తలకు చెక్‌.. ప్రభాస్‌ టీం నుంచి అధికారిక ప్రకటన!
రాజా సాబ్‌ రిలీజ్‌ వాయిదా వార్తలకు చెక్‌.. టీం నుంచి అధికారిక ప్రకటన!

Rajasaab: రాజా సాబ్‌ రిలీజ్‌ వాయిదా వార్తలకు చెక్‌.. ప్రభాస్‌ టీం నుంచి అధికారిక ప్రకటన!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం రోజులుగా ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌ (VFX) షాట్లు ఇంకా పూర్తవ్వలేదనే కారణంతో ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా నిర్మాతలు ఈ రూమర్స్‌కి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వివరాలు 

అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

"ప్రస్తుతం 'రాజా సాబ్' పోస్ట్‌ ప్రొడక్షన్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా 2026 జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఐమాక్స్ వెర్షన్‌తో సహా, అన్ని ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మా ప్లాన్‌. అలాగే, డిసెంబర్‌ చివరి వారంలో అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 25లోపే ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. కాబట్టి రిలీజ్‌ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు. సంక్రాంతి వేడుకలకు డబుల్ ఫెస్ట్‌గా 'రాజా సాబ్' సిద్ధమవుతోంది," అంటూ రాసుకొచ్చారు టీం. దీంతో సినిమా వాయిదాపై వస్తున్న వార్తలకు ముగింపు పలికినట్టయింది.

వివరాలు 

త్వరలోనే తొలి పాట విడుదల

ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్‌ను వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే తొలి పాట విడుదల కానుంది. వింటేజ్ ప్రభాస్ లుక్‌లో చాలా రోజుల తర్వాత తెరపైకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రెస్ నోట్ విడుదల చేసిన రాజా సాబ్ టీం