Page Loader
Guntur Kaaram' Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో విడుదల.. మహేష్ స్వాగ్ కి ఫిదా అవుతున్న అభిమానులు 

Guntur Kaaram' Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో విడుదల.. మహేష్ స్వాగ్ కి ఫిదా అవుతున్న అభిమానులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నటాలీవుడ్ నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల ఆనందానికి హద్దులు ఉండవు. మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు కారం' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి రిలీజైన 'కుర్చీ మడతపెట్టి ' సాంగ్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Details 

మహేష్ ఆట,పాట మామూలుగా లేదు 

టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించిందే కానీ వారు ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా విడుదల చేయలేదు. ఇక, ఇప్పుడు 'గుంటూరు కారం' మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో మహేష్ ను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఫైటింగ్ సీన్స్‌ చిత్రీకరణలో మహేష్ కొత్త అవతారంలో కనిపించారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే మహేష్ ఆట,పాట మామూలుగా ఉండదనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'గుంటూరు కారం' మేకింగ్ వీడియో