
Vijay Sethupathi : వరుస సినిమాలతో బిజీగా మారిన మక్కల్ సెల్వన్
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది 'మహారాజా'తో భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి, 'విడుదల పార్ట్ 2' రూపంలో పెద్ద షాక్ తగిలింది.
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా కేవలం ఓ ఎక్స్‌పెరిమెంటల్ మూవీగానే మిగిలిపోయింది.
అయితే "మహారాజా"తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. సినిమాల లైనప్ విషయంలో విజయ్ సేతుపతి ఇప్పుడు ధనుష్ మార్గాన్ని అనుసరిస్తున్నాడు.
ధనుష్ మాదిరిగా మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నాడు. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడంపై కూడా ఫోకస్ పెడుతున్నాడు.
Details
మూడు సినిమాలకు తేదీలు ఫిక్స్ చేయని హీరో
ప్రస్తుతం విజయ్ నటించిన ఆర్ముగం కుమార్ దర్శకత్వం వహించిన 'ఏస్', మిస్కిన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ట్రైన్' సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
ఈ రెండు చిత్రాల్లో వరుసగా రుక్మిణీ వసంత్, శ్రుతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే ఇంకా టైటిల్ ఖరారు చేయని VJS 54 సినిమా షూటింగ్ కూడా ముగిసిపోయింది.
అయితే ఈ మూడు సినిమాలకి విడుదల తేదీలు ఇంకా ఖరారవ్వలేదు. ఇప్పటికే పూర్తయిన 'పిశాసు 2', సైలెంట్ మూవీ "గాంధీ టాక్స్" కూడా ఇంకా రిలీజ్‌కి నోచుకోలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి తాజా ప్రాజెక్టుల కోసం దూసుకెళ్తున్నాడు. ఇప్పుడిలా క్రేజీ డైరెక్టర్లను లైన్లో పెట్టేస్తున్న విజయ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Details
సెంథిల్ కుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి
'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ఫ్లాప్‌ల తర్వాత తెలుగు హీరోలే పూరీతో పనిచేయాలా? అనే సందేహంలో ఉన్న సమయంలో విజయ్ సేతుపతి మాత్రం రిస్క్ తీసుకుని డేరింగ్ స్టెప్ వేశాడని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటివరకు తన డైరెక్షన్‌లో ఫ్లాపులే చూసిన ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్‌కు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
'గరుడన్' సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం 'లెజెండ్' శరవణన్‌తో ఓ సినిమా చేస్తున్నారు.
ఆ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే విజయ్ సినిమాపై పని మొదలు పెట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా, ముందుగా పూరీ దర్శకత్వంలో చేసే సినిమా పూర్తి చేయాలన్నది విజయ్ సేతుపతి ప్లాన్.