Page Loader
మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ 
మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో.. అతనెవరో తెలుసా

మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 30, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కన్నప్ప' హీరో మంచు విష్ణు సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నారు. మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ మంచు కథానాయకుడితో కలిసి తెరను పంచుకోనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ నటించనున్న విషయం తెలిసిందే. శివుడి పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కన్నప్ప మీద అంచనాలు మించిపోతున్నాయి. ప్రభాస్‌కి జోడిగా, పార్వతిగా నయనతార అభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోకి మరో సూపర్ స్టార్ వచ్చి చేరుతున్నారు. కన్నప్పలో ముఖ్యమైన పాత్రను మోహన్ లాల్ పోషించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో కలిసి దిగిన ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో రానున్న ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి బాణీలను అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.150కోట్లతో సినిమా నిర్మాణం