Loading...
Sreejith Ravi: పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష
పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష

Sreejith Ravi: పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మాలీవుడ్ నటుడు, టీజీ రవి కుమారుడు శ్రీజిత్ రవిని పోక్సో కేసులో కోర్టు దోషిగా తేల్చింది. 2022లో త్రిసూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు త్రిసూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది.

వివరాలు

అసలేం జరిగిందంటే?

ఈ ఘటన 2022 జూలై 4న చోటుచేసుకుంది. త్రిసూర్‌లోని అరనాట్టుకరలో ఇద్దరు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా శ్రీజిత్ రవి తన కారులో వారిని వెంబడించారు.

అనంతరం అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో వారిని చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శించి అసభ్యకరంగా ప్రవర్తించారు.

దీనిపై కేసు నమోదవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించారు.

వివరాలు

శిక్ష తగ్గించాలన్న అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

శ్రీజిత్ రవికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, ఈ కేసు తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఆయన తరఫు న్యాయవాది శిక్ష తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.

నిందితుడు ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని, ఈ ఘటన వారిపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.

అందుకే ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది.

అంతేకాకుండా శ్రీజిత్ రవి నుంచి జరిమానా వసూలు చేస్తే, ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా ఇద్దరు బాలికలకు సమానంగా పంచాలని కూడా కోర్టు ఆదేశించింది.

ADVERTISEMENT