Mohanlal: మలయాళ పరిశ్రమ అమ్మలాంటిది.. దయచేసి నాశనం చేయకండి : మోహన్ లాల్
మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీనియర్ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమ్మ ప్రెసిడెంట్ మోహన్ లాల్ సహా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ఈ అంశంపై హయత్ రీజెన్సీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మోహన్‌లాల్ మాట్లాడారు. అమ్మ ఒక ట్రేడ్ యూనియన్ కాదని ఇది ఒక కుటుంబమని చెప్పారు.
ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం
ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, మలయాళ సినీ పరిశ్రమలో చాలా మంచి పనులు కూడా చేశామన్నారు. ఇలాంటి ఆరోపణలు పరిశ్రమపై చెడు ప్రభావం చూపిస్తాయన్నారు. తాను హేమ కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చానని, రిపోర్టు వెలువడే వరకు సహనం వహించాలని కోరారు. మహిళలను వేధించే వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పూర్తి సహకారమందిస్తామన్నారు. హేమా కమిషన్ నివేదిక వెలువడిన తర్వాత, మోహన్‌లాల్ మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి.