Gopalakrishnan: మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలచివేస్తున్నాయి. తాజాగా మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (Mankombu Gopalakrishnan) కన్నుమూశారు.
కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, నిన్న (మార్చి 17) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) కారణంగా తుదిశ్వాస విడిచారు.
గోపాలకృష్ణన్ మరణవార్తపై సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త విని బాధగా ఉందని, ఆయన సాహిత్యం, కవిత్వం, సంభాషణలు శాశ్వత ముద్ర వేశాయని కొనియాడారు.
ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లలో ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలని చెప్పారు.
Details
200 చిత్రాలకు పైగా పాటలు రాసిన అనుభవం
గోపాలకృష్ణన్ 200 చిత్రాలకు పైగా పాటలు రాశారు. 700కు పైగా పాటలకు సాహిత్య రచన చేశారు.
డైలాగ్ రైటర్‌గా కూడా మంచి గుర్తింపు సాధించారు.
ఇటీవల బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం యానిమల్ మలయాళ వెర్షన్‌లో పాటలు రాశారు. ఆయన మరణం మలయాళ చిత్రసీమకు తీరని లోటుగా మారింది.