మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య
కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది.మలయాళ బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజధాని తిరువనంతపురంలోని శ్రీకార్యంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుేకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి వచ్చారు.అనంతరం జరిగిన విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు బలవన్మరణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సీరియల్ 'స్త్రీ'తో రెంజూషా మీనన్, నటిగా తెరంగేట్రం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. మరణానికి కొద్దిగంటల ముందు ఇన్‌స్టాలో ఉత్సాహంగా రీల్స్ షేర్ చేయడం గమనార్హం.