Page Loader
Tv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ 
శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ

Tv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 01, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సీరియల్ నటీమణి డాక్టర్ ప్రియ గుండెపోటుతో మరణించారు. మలయాళ టీవీ షో కరుతముత్తుతో ఎంతో పేరుగాంచిన నటి డాక్టర్ ప్రియ 35 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించే సమయానికి ఎనిమిది నెలల గర్భిణి కావడం గమనార్హం.దీంతో టీవీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. నటుడు కిషోర్ సత్య ఈ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నారు.పరిశ్రమలో డాక్టర్ ప్రియ సుపరిచితమైన నాయకి అన్నారు. వృత్తిరీత్యా ప్రియ వైద్యురాలని, వివాహం తర్వాత ఆమె నటనా జీవితానికి స్వల్ప విరామం ప్రకటించారన్నారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ తర్వాత డా.ప్రియ కన్నుమూశారు. ఆమె నవజాత శిశువు ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీయూలో ఉన్న డా.ప్రియ నవజాత శిశువు