Page Loader
పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మంత్రి మల్లారెడ్డికి అఫర్
మంత్రి మల్లారెడ్డి పవన్ సినిమాలో ఆఫర్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మంత్రి మల్లారెడ్డికి అఫర్

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 27, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. కష్టపడ్డా, పనిచేసినా, పాలమ్మినా అని ఆయన చెప్పే డైలాగ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి, ఆసక్తికర వ్యాఖ్యాలు చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయనకు ఆఫర్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్, మంత్రి మల్లారెడ్డికి విలన్ రోల్ ఆఫర్ చేసారట. తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం, మంత్రి మల్లారెడ్డి విలన్ గా కనిపిస్తే బాగుంటుందని అనుకున్నారట.

మంత్రి మల్లారెడ్డి

ఆఫర్ ని రిజెక్ట్ చేసిన మంత్రి మల్లారెడ్డి

హరీష్ శంకర్ ఇచ్చిన ఆఫర్ ను వద్దన్నట్లు, స్వయంగా మంత్రి మల్లారెడ్డి ఒకానొక మీటింగ్ లో చెప్పుకొచ్చారు. ఈ విషయం, ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి, పవన్ సినిమాలో కనిపిస్తే సినిమాకు మరింత అట్రాక్షన్ వచ్చేదని కొంతమంది భావిస్తున్నారు. మరికొంతమందేమో, మంత్రి మల్లారెడ్డి విలన్ ఆఫర్ చేసాడు కాబట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ రోల్ ప్రత్యేకంగా ఉండనుందని అర్థం చేసుకుంటున్నారు. ఆ పాత్రను హరీష్ శంకర్ బాగా తీర్చిదిద్ది ఉంటాడని ఊహిస్తున్నారు. అదలా ఉంచితే, ఏప్రిల్ నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది.