LOADING...
Mammootty: న్యాయవాది నుంచి సూపర్‌స్టార్‌గా.. పద్మభూషణ్ గౌరవం అందుకోనున్న మమ్ముట్టి
న్యాయవాది నుంచి సూపర్‌స్టార్‌గా.. పద్మభూషణ్ గౌరవం అందుకోనున్న మమ్ముట్టి

Mammootty: న్యాయవాది నుంచి సూపర్‌స్టార్‌గా.. పద్మభూషణ్ గౌరవం అందుకోనున్న మమ్ముట్టి

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మమ్ముట్టికి ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 25న జరగనున్న అవార్డు కార్యక్రమం నేపథ్యంలో ఆయన సినీ ప్రయాణం మరోసారి చర్చనీయాంశమైంది. 420కు పైగా చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పటికీ కంటెంట్‌ ఆధారిత సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే సినీ రంగంలోకి రావడానికి ముందు ఆయన న్యాయవాదిగా పనిచేసిన విషయం చాలామందికి తెలియదు.

వివరాలు 

రెండేళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్

1951 సెప్టెంబర్‌ 7న జన్మించిన మమ్ముట్టి ఎర్నాకుళంలోని గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. అనంతరం మంజేరిలో దాదాపు రెండేళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. కానీ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో ఆయన సినిమా రంగం వైపు మళ్లారు. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్‌ను కలిసిన తర్వాత మమ్ముట్టికి సినీ అవకాశాలు లభించాయి. నటుడిగా రాణించాలన్న ఆయన తపన నాయర్‌ను ఆకట్టుకోవడంతో సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

వివరాలు 

స్టార్ హీరోగా ఎదిగిన తీరు.. కెరీర్‌లో కీలక మైలురాళ్లు.. జాతీయ అవార్డులు 

'విల్క్కనుండు స్వప్నంగల్','మేళా', 'అహింస' వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో మమ్ముట్టి కెరీర్ ప్రారంభమైంది. 1987లో వచ్చిన 'న్యూ ఢిల్లీ' సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం మమ్ముట్టిని మలయాళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది. విభిన్న పాత్రల్లో ఒదిగిపోయే నటన, తెరపై ఆయన చూపించే హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'ఒరు వడక్కన్ వీరగాథ', 'మథిలుకల్' వంటి చిత్రాలకు గాను మమ్ముట్టి జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఆయన తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'తలపతి', 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్' వంటి సినిమాలు ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాయి. సుమారు రూ.340 కోట్ల ఆస్తులు కలిగిన మమ్ముట్టి 1998లోనే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Advertisement

వివరాలు 

'పీపుల్స్ పద్మ' అంటే ఏమిటి?

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'పీపుల్స్ పద్మ'(People's Padma) కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పద్మ పురస్కారాలు అందజేస్తోంది. 2026లో ఈ కార్యక్రమం కింద 'పుస్తక మనే' అనే ఉచిత గ్రంథాలయాన్ని స్థాపించిన అంకే గౌడ, ఆసియాలో తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసిన డాక్టర్ ఆర్మిడా ఫెర్నాండెజ్, సంప్రదాయ హస్తకళలను కాపాడటంలో కృషి చేసిన తృప్తి ముఖర్జీకి పద్మశ్రీ అవార్డులు లభించాయి.

Advertisement