Page Loader
Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్ 

Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్ 

వ్రాసిన వారు Stalin
Jan 20, 2024
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు. గతేడాది నవంబర్‌లో రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో బ్లాక్ వర్కౌట్ డ్రెస్‌లో ఉన్న బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ ముఖం ఎడిట్ చేసి.. రష్మిక ముఖాన్ని భర్తీ చేశాడు. ఈ వీడియోకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తులో నిందితుడిని పోలీసులు గుర్తించి.. అతడిని అరెస్ట్ చేశారు. డీప్‌ఫేక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఒక వ్యక్తి పోలికను మరొకరితో ముఖంతో భర్తీ చేసే డిజిటల్ పద్ధతి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీలో నిందితుడి అరెస్టు