LOADING...
Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. బయట పెట్టకుండా మౌనంగా ఉన్నా: మంచు లక్ష్మి
ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. బయట పెట్టకుండా మౌనంగా ఉన్నా: మంచు లక్ష్మి

Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. బయట పెట్టకుండా మౌనంగా ఉన్నా: మంచు లక్ష్మి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంట్లో ఎవరికి హిట్ వచ్చినా అది అందరిదీ అనే భావనతో సంతోషపడతానని నటి మంచు లక్ష్మి అన్నారు. ప్రస్తుతం ఆమె తన తండ్రి మోహన్‌ బాబుతో కలిసి నటించిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌ 'దక్ష' సెప్టెంబర్‌ 19న విడుదల కానుండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబంలో జరిగిన వివాదాలపై కూడా ఆమె స్పందించారు.

వివరాలు 

ఆర్టిస్ట్‌ ఎదుర్కొనే కష్టాలు నాకు బాగా తెలుసు: లక్ష్మి 

'మిరాయ్‌ సినిమా విజయం నాకూ ఎంతో ఆనందం కలిగించింది. మా ఇంట్లో ఎవరికి హిట్‌ వచ్చినా, దాన్ని మన అందరి గెలుపుగా భావిస్తాను. ఎవరైనా శ్రమించి చేసిన పని వృథా కావాలని నేను ఎప్పుడూ కోరుకోను. జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి కానీ కష్టానికి ఫలితం రాకపోవడం చూడాలని అనుకోను. ఎందుకంటే సినిమా రంగంలో ఒక ఆర్టిస్ట్‌ ఎదుర్కొనే కష్టాలు నాకు బాగా తెలుసు. అలాంటి సందర్భాల్లో నేను సలహాలు ఇస్తుంటాను. ఇటీవల మంచు మనోజ్‌ని కలిసినప్పుడు కూడా 'మిరాయ్‌' విజయాన్ని పండగలా ఆస్వాదించమని చెప్పాను'' అని వివరించారు.

వివరాలు 

అందుకే నేను మౌనంగా ఉన్నాను: మంచు లక్ష్మి 

''ఏ కుటుంబంలోనైనా సమస్యలు వచ్చినప్పుడు అందరూ కొంతవరకు దెబ్బతింటారు. అలా జరగదు అని చెప్పడం అబద్ధం. కానీ మేము ఉండేది అద్దాల మేడలో... ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, వాళ్లకు నచ్చినట్లు కత్తిరించి రాసుకునే రోజులు ఇవి. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండటం ఉత్తమమని అనిపించింది. అందుకే నేను మౌనంగా ఉన్నాను. గతంలో ఏది సరి, ఏది తప్పు అని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచన మారింది. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందా లేక బాధ పెడుతుందా అన్నదే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు ఒక పాఠం నేర్పుతుంది. దాన్ని మౌనంగా ఆలోచించగలిగితేనే మనసుకు ప్రశాంతత లభిస్తుంది'' అని మంచు లక్ష్మి అన్నారు.