తదుపరి వార్తా కథనం
Manchu Lakshmi : జడలు వేసుకుంటున్న మూడు తరాల మంచు మహిళలు.. వీడియో పోస్టు చేసిన మంచు లక్ష్మి
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Dec 05, 2023
06:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మంచు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.
తాజాగా మంచు లక్ష్మి ఓ ఫ్యామిలీ వీడియో షేర్ చేసి ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నటీమణిగా, యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి, తల్లి, కూతుళ్లతో కలిసి తీసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ మేరకు మంచు లక్ష్మి, తల్లి నిర్మలా దేవి, కూతురు విద్యా నిర్వాణ జడలు వేసుకుంటున్న వీడియోని ఆమె షేర్ చేశారు.
'అమ్మా' అనే ట్యాగ్‌తో మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవతోంది. 3 తరాల అమ్మలను ఇలా చూడటం సంతోషంగా ఉందని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు.