హిందీలో నటించేందుకు మంచు లక్ష్మీ సిద్ధం: ముంబైకి మకాం మార్చిన మంచువారమ్మాయి
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురుగా టెలివిజన్ టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మంచు లక్ష్మి, ఆ తర్వాత సినిమాల్లోనూ కనిపించారు. గుండెల్లో గోదావరి, అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాల్లో మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మంచు లక్ష్మి చాలా చిత్రాల్లో నటించారు. మంచు లక్ష్మి చివరగా మలయాళం లో మాన్ స్టర్ అనే చిత్రంలో కనిపించారు. మలయాళంలో మంచు లక్ష్మి మొదటి చిత్రం ఇది. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా కనిపించారు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో మంచు లక్ష్మి కనిపించలేదు. ప్రస్తుతం మంచు లక్ష్మి హిందీలో నటించేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
హిందీ సినిమాలపై వెబ్ సిరీస్ ల పై మంచు లక్ష్మి ఆసక్తి
హిందీ సినిమాల్లో నటించేందుకు మంచు లక్ష్మి ముంబై వెళ్లారని అంటున్నారు. హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించేందుకు మంచు లక్ష్మి ఆసక్తిగా ఉన్నారని, ఈ మేరకు ముంబైకి మకాం మార్చారని అంటున్నారు. తాను ముంబై వెళ్లానన్న వార్తలకు స్పందించిన మంచు లక్ష్మి, కొత్త నగరం.. కొత్త ప్రపంచం, నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ముంబైకి తాను మకాం మార్చినట్లు మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు సినిమాలను నిర్మించిన మంచి లక్ష్మి, మరి హిందీలో ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి.