
Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
సోలో హీరోగా తెరకెక్కుతున్న 'మనం మనం బరం పురం' సినిమా ఆగిపోవడంతో మల్టీస్టారర్ ప్రాజెక్టుల వైపు హీరో మంచు మనోజ్ అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌లతో కలిసి నటించిన 'భైరవం' సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.
షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, డిజిటల్ హక్కుల ఒప్పందం ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.
ఇంకా తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్' సినిమాలో మనోజ్ నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇవి కాకుండా, ఇప్పుడు సోలో హీరోగా కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
Details
త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు
కొంతకాలం క్రితం కార్తికేయ హీరోగా '90ML'సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ రెడ్డి మనోజ్‌కు ఓ కథను వినిపించాడట.
కథ చాలా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మనోజ్. ఈ చిత్రానికి 'అత్తరు సాయిబు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.
టైటిల్ చూస్తేనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. ఈ సినిమాను ఒక యంగ్ ప్రొడ్యూసర్ నిర్మించనున్నాడు.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుందని టాక్. చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా 'అత్తరు సాయిబు' సినిమాతో మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ద్వారా అతడి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.