Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో
సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయమైంది. ఆయన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి మౌనిక కూడా ఉన్నారు. ఆస్పత్రి చేరిన తరువాత, సమాచారం తెలుసుకున్న మీడియా వర్గాలు అందరూ అక్కడ చేరుకున్నారు. అయితే మనోజ్, మౌనిక మీడియాతో మాట్లాడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం మనోజ్ ఆస్పత్రికి వెళ్లే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఆస్తుల విషయంలో మంచు మోహన్‌బాబు, మనోజ్ మధ్య గొడవలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారని కథనాలు వెలువడినాయి.
ఒకరిపై ఒకరు ఫిర్యాదు
అయితే మంచు మోహన్‌బాబు కుటుంబం ఈ వార్తలను అసత్యంగా పేర్కొంది. వారు అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించమని మీడియాకు సూచించారు. ఇప్పటికే, ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో ఆస్పత్రికి రావడం మరోసారి చర్చకు దారి తీసింది. మంచు మోహన్‌బాబు, మనోజ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.