Page Loader
Manchu Manoj: మిరయ్ లో  మంచు మనోజ్ స్పెషల్ సప్రయిజ్ ?
Manchu Manoj: మిరయ్ లో  మంచు మనోజ్ స్పెషల్ సప్రయిజ్ ?

Manchu Manoj: మిరయ్ లో  మంచు మనోజ్ స్పెషల్ సప్రయిజ్ ?

వ్రాసిన వారు Stalin
May 20, 2024
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు ఫాంటసీ చిత్రం 'మిరయ్'. కార్తీక్ ఘట్టమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ అనే డేంజరస్ కత్తితో యుద్దాలు చేస్తున్నట్టు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ గ్లింప్స్ వీడియోను మేకర్స్ డిజైన్ చేసారు.

Details 

 విలన్‌గా మంచు మనోజ్

ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18కి ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం గౌర అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డిలో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్