Page Loader
Manchu Ustaad: భార్య చేతుల మీదుగా మంచు మనోజ్ 'ఉస్తాద్' ప్రోమో విడుదలైంది..చూశారా
Manchu Ustaad TalkShow : మనోజ్ రిటర్న్​ గిఫ్ట్.. 'ఉస్తాద్' ప్రోమో రిలీజ్

Manchu Ustaad: భార్య చేతుల మీదుగా మంచు మనోజ్ 'ఉస్తాద్' ప్రోమో విడుదలైంది..చూశారా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 06, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హోస్ట్​గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే టాక్ షో ప్రారంభమైంది. ఈ మేరకు బుధవారం ఈ షో ప్రోమో సైతం రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే త్వరలోనే మనోజ్ బుల్లితెరపై ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హోస్ట్​గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే గేమ్ షో ఇప్పటికే హుషారెత్తిస్తోంది. ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు హీరో మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఆయన భార్య మౌనిక, ఈ ప్రోగ్రామ్ ప్రోమోను రిలీజ్ చేశారు. డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్​లో ఈషో ప్రసారం కానుంది. కెరీర్​లో మనోజ్ తొలిసారిగా హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంచు భూమా మౌనిక చేతుల మీదుగా ప్రోమో రిలీజ్