Page Loader
Kannappa : 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

Kannappa : 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి పెద్ద స్టార్ నటీనటులు ఇందులో భాగంగా ఉన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నటించిన పాత్రల పోస్టర్లు,టీజర్ విడుదలయ్యాయి.

వివరాలు 

తుది దశలో షూటింగ్ 

డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా పూర్తికాకపోవడంతో, చిత్రం విడుదలను వాయిదా వేస్తూ నేడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 'కన్నప్ప'ను వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశలో ఉంది. న్యూజిలాండ్ అడవులతో పాటు, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరణ చేస్తున్నారు. కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథ జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కన్నప్ప'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎంతవరకు స్పందన వస్తుందో వేచి చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కన్నప్ప మూవీ అప్డేట్