Page Loader
Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్
మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్

Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

త్రివిధ దళాల్లో సేవచేస్తున్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు మద్దతుగా నిలవాలని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రొ-చాన్స్‌లర్ విష్ణు మంచు నిర్ణయం తీసుకున్నారు. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలు అమోఘమని, వారి సేవలకు కృతజ్ఞతలు తెలపడానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. తమ నిర్ణయం ఇతర విద్యాసంస్థలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని విష్ణు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలందరికీ స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు ఆయన చెప్పారు.