Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు.
సోమవారం మోహన్‌బాబు యూనివర్సిటీలో ఆ చిన్నారులతో కలిసి సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటవస్తువులు, దుస్తులు అందజేశారు.
ఆ తర్వాత మాట్లాడిన మంచు విష్ణు, 120 మంది చిన్నారులకు విద్య, వైద్య సేవలతో పాటు కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని పేర్కొన్నారు.
Details
సంస్థకు పెద్దన్న తోడుగా ఉంటా
కుడిచేత్తో చేసే సాయం ఎడమచేతికి తెలియకూడదన్న మాట ఉన్నా, తాను చేసిన మంచి పని మరెవరికి ఆదర్శంగా మారుతుందనే ఆశతో చెప్పినట్లు చెప్పారు.
మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి అనాథలకు ఆశ్రయం ఇస్తూ, అద్భుతమైన సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
సంస్థకు పెద్దన్నగా తమ మద్దతు కొనసాగుతుందని, ఆ చిన్నారులందరూ తన కుటుంబసభ్యుల్లాంటివారని తెలిపారు. వారితో పండుగ జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.