Page Loader
Mangalavaram: JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం 
JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం

Mangalavaram: JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2024
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

RX 100 విజయం తరువాత, నటి పాయల్ రాజ్‌పుత్ తో దర్శకుడు అజయ్ భూపతి తీసిన థ్రిల్లర్ మంగళవారం. గత నవంబర్‌లో విడుదల అయ్యి మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులకు ఎంపికైంది. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు జైపూర్ ఫిలిం ఫెస్టివల్(Jaipur Film Festival) జరగనుంది. ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పుత్, బెస్ట్ సౌండ్ డిజైనర్ గా ఎం ఆర్ రాజా కృష్ణన్, బెస్ట్ ఎడిటింగ్ గుళ్ళపల్లి మాధవ్ కుమార్,బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ముదసర్ మొహమ్మద్ ని అవార్డులు వరించాయి.

Details 

ఫిలిం ఫెస్టివల్ లో  స్క్రీనింగ్ కి పలు తెలుగు సినిమాలు

జైపూర్ లో వచ్చిన అవార్డ్స్ తో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో పలువురు చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో పాయల్ రాజపుత్ సరసన ప్రియదర్శి కథానాయకుడిగా నటించాడు. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. అలాగే ముద్ర క్రియేషన్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ వారు నిర్మాణం వహించారు. ఈ ఫెస్టివల్ లో పలు సినిమాలు స్క్రీన్ చేయనుండగా ఇందులో భగవంత్ కేసరి, కార్తికేయ 2తో పాటు పలు తెలుగు సినిమాలు కూడా సెలెక్ట్ అయ్యాయి.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మేకర్స్ ఇంస్టాగ్రామ్ పోస్ట్