Page Loader
'మంగళవారం' సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా.. 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

'మంగళవారం' సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా.. 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 26, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రం రిలీజ్ డే''ట్ ను నిర్మాణ బృందం ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. వైవిధ్యభరితమైన కథలతో అజయ్ భూపతి ముందుకు వెళుతున్నాడు. అంతకముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన 'RX 100' మంచి హిట్టాక్ ను సొంతం చేసుకుంది. స్వాతి-సురేశ్ వర్మ నిర్మించిన ఈ సినిమా, సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా పేరు గాంచింది. ఈ చిత్రం 1980-90ల మధ్య గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా టేకింగ్ సహా అజనీశ్ లోక్ నాథ్ సంగీతం చిత్రానికే బలంగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానున్న మంగళవారం