Page Loader
Mangalavaram: 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ 
Mangalavaram: 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

Mangalavaram: 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ 

వ్రాసిన వారు Stalin
Nov 07, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం అజయ్ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'మంగళవారం'. ట్రైలర్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. నవంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరగనున్న 'మంగళవరం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఈ సినిమా నిర్మాత స్వాతి రెడ్డి, అల్లు అర్జున్‌ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలో‌నే ఆమెపై ఉన్న అభిమానంతో ఈవెంట్‌‌కు రావడానికి అంగీకరించినట్లు తెలిసింది. విజువల్స్ ఫీస్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డ్ ధరలకు అమ్ముడయ్యాయి. నవంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో అజ్మల్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవంబర్ 17న సినిమా విడుదల