
Payal Rajput: 'మంగళవారం' సినిమా రిలీజ్.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన 'మంగళవారం' మూవీ ఇవాళ విడుదలైంది.
నిన్న రాత్రే కొన్ని చోట్ల ఈ మూవీ ప్రీమియర్స్ రన్ అయ్యారు.
ఈ ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ రావడంతో మార్నింగ్ షోకి ఆడియన్స్ క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ మూవీకి సూపర్ రివ్యూస్ వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ అద్భుత నటనతో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ ఓ వీడియోను విడుదల చేసింది.
ఇందులో ఆమె ఎమోషనల్ అవుతూ కనిపించారు.
ఇలాంటి వీడియోలు తాను ఎప్పుడూ పోస్ట్ చేయలేదని, ఈ వీడియోను కూడా డిలీట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Details
ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపిన పాయల్
ఈ సినిమాలో పాయల్ సెక్సువల్ డిజాడర్‌తో బాధపడే పాత్రలో నటించింది.
అయితే పాత్ర కోసం తాను చేసిన యాక్టింగ్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అమె తెలిపింది.
ఈ సినిమా ఆదరించినందుకు ధన్యవాదాలని, ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని, ఇందులో ఎంతో కష్టపడి పనిచేశానని పాయల్ రాజ్ పుత్ పేర్కొంది.
ఇప్పటికే కొన్ని చోట్ల ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, సపోర్టుగా నిలిచిన వారందరికి థ్యాంక్స్ అంటూ పాయల్ భావోద్వేగానికి లోనయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రేక్షకులకు ధన్యవాదాలు : పాయల్
#Mangalavaaram : #PayalRajput turns emotional after watching the film.pic.twitter.com/X5LFdLevy8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) November 16, 2023