
మంగళవారం నాడు మంగళవారం టీజర్ రిలీజ్.. బోల్డ్ లుక్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు బోల్డ్ లుక్ తో పాయల్ రాజ్‌పుత్ అందాలతో కనువిందు చేస్తోంది.
ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో మంగళవారం సినిమా రూపుదిద్దుకుంటోంది.
గ్రామీణ నేపథ్యంతో సాగే హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు మంగళవారం టీజర్ ను విడుదల చేశారు.
ఆసాంతం టీజర్ ఉత్కంఠ రేపింది. ప్రధాన పాత్రదారుల్లో భయం, ఆశ్చర్చాన్నిచూపించారు. టీజర్‌లోని సీన్స్ ఎక్కువగా డార్క్ మోడ్‌తో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
టీజర్ చివరలో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ సీన్స్‌తో కవ్విస్తోంది. మరోవైపు ముసుగు ధరించిన వ్యక్తిని సైతం చూపించారు. మంగళవారం సినిమాలో చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించారు.
details
పాన్ ఇండియన్ స్థాయిలో దక్షిణాది భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు
పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మహా సముద్రం మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.
మరోవైపు ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఆ స్థాయి సూపర్ హిట్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది.
ప్రస్తుతం మంగళవారం సినిమాపైనే పాయల్ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో నటనకు, ప్రతిభకు అద్దం పట్టే పాత్రలో పాయల్ నటిస్తోంది.
మంగళవారం సినిమాకు డైరెక్టర్ బాధ్యతలతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ అజయ్ భూపతి వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.