LOADING...
ART CINEMASS: మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ.. ART మాల్‌లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!
మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ.. ART మాల్‌లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!

ART CINEMASS: మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ.. ART మాల్‌లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్‌లో ఏషియన్ సునీల్‌తో కలిసి భాగస్వామిగా ఉన్నారు. అత్యుత్తమ స్క్రీనింగ్ సౌకర్యాలను అందిస్తూ, ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను ఈ థియేటర్ సంపాదించుకుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్‌లో ముందే అడుగుపెట్టారు. అమీర్‌పేటలోని ఏషియన్ సత్యం సినిమాస్‌లో భాగస్వామిగా ఉన్న ఆయన, ట్రైలర్ లాంచ్‌లు, ప్రీమియర్ షోలకు కేరాఫ్ అడ్రస్‌గా AAA మాల్‌ను మార్చారు. ఇదే ఊపులో ఇప్పుడు విశాఖపట్నంలోనూ అల్లు అర్జున్, ఏషియన్ సునీల్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ కూడా థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Details

'ART' పేరుతో భారీ మల్టీప్లెక్స్‌

హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఏషియన్ సునీల్‌తో కలిసి 'ART' పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. మొత్తం 6 స్క్రీన్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో, ఒకటి ఎపిక్ లార్జ్ స్క్రీన్, మూడూ బిగ్ స్క్రీన్లు, మిగిలిన రెండూ చిన్న స్క్రీన్లుగా రూపొందించబడ్డాయి. ఇవన్నీ ఆధునిక సౌండ్ సిస్టమ్‌తో సుసज्जితంగా ఉండనున్నాయి. నిర్మాణ పనులు పూర్తయ్యిన ART సినిమాస్, ఈ నెల 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇలా చూస్తే, మహేష్ బాబు, అల్లు అర్జున్‌, రవితేజ తదితర స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు మల్టీప్లెక్స్ వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆసక్తికరంగా, వీళ్లందరూ ఏషియన్ సునీల్‌తో భాగస్వామ్యంగా ఈ రంగంలోకి వచ్చారు.