HBD Varun Tej: సూర్యాపేటలో వరుణ్ తేజ్ భారీ కటౌట్
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట రాజుగారి తోట ప్రాంతంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా U V media ఆధ్వర్యంలో 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాగా, వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలలో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. రీసెంట్‌గా మూవీ టీమ్ రిలీజ్ చేసిన వందేమాతరం సాంగ్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.