Naa Saami Ranga: 'నా సామిరంగ' టీజర్‌తో సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున
కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారి అక్కినేని నాగార్జునతో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్లతో హీరో నాగార్జున సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ మూవీలో అల్లరి నరేష్ ఉండబోతున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన ఆశ్చర్యపర్చిన మేకర్స్.. ఆదివారం విడుదల చేసిన టీజర్‌తో మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో మూడో హీరోగా రాజ్ తరుణ్ కూడా ఉన్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. దీంతో ఈ సంక్రాంతికి 'నా సామి రంగ' మూవీ.. ముగ్గురు హీరోలతో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టీజర్‌లో పూర్తిగా పెరిగిన గడ్డంతో నాగార్జున మాస్‌లుక్‌లో కనిపించారు. ఇందులో ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది.