Page Loader
OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ 
ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్

OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

2019లో సూపర్ హిట్ సాధించిన శ్రీసింహా హీరోగా, కాల భైరవ సంగీతం అందించిన "మత్తువదలరా"లో సత్య, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం "మత్తువదలరా-2". మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించారు.ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకున్నట్లే, సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు పొందుతూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. శ్రీ సింహ కోడూరి, సత్య చేసిన కామెడీ నవ్వులు పూయించడంతో, ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గా నిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

వివరాలు 

 ఫీమేల్ లీడ్‌గా ఫరియా అబ్దుల్లా 

థియేటర్లలో భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో,డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌కు వెళ్లాయి. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది,ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వస్తుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. థియేటర్‌లో 28రోజులు రన్‌ చేసిన తర్వాత ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేందుకు అందుబాటులో ఉంది. థియేటర్స్‌లో సూపర్ హిట్ అయిన ఈచిత్రం ఓటీటీ లో ఎంతమేరకు సక్సెస్ అవుతుందో,ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో చూడాలి. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాను ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్‌గా నటించింది.అలాగే ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.