
Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని హీరోతో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన మీనాక్షి చౌదరి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఒక అక్కినేని హీరోతో ఆమె ప్రేమలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన మీనాక్షి మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చదువులో టాపర్‌గా నిలిచి, డాక్టర్ అర్హత సాధించడంతో పాటు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లోనూ ప్రతిభ చాటిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఆమె. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి, ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా వంటి చిత్రాల్లో నటించారు.
Details
ప్రస్తుతం నాగ చైతన్యతో NC 24లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి
అయితే ఆమెకు నిజమైన బ్రేక్ ఇచ్చింది లక్కీ భాస్కర్. ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజలో నిలిచింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన NC 24లో హీరోయిన్‌గా నటిస్తోంది. వ్యక్తిగత జీవితంపై వస్తే, నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో మీనాక్షి డేటింగ్‌లో ఉందన్న గాసిప్స్ చాలాకాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సమయంలోనే ఈ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
Details
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మీనాక్షి మాస్క్ ధరించి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో వెంబడి రావడం వీడియోలో రికార్డ్ కావడంతో, వీరి రిలేషన్‌పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు మీనాక్షి ఈ రూమర్స్‌పై స్పందిస్తూ, సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ, మళ్లీ మళ్లీ వీరి పేర్లు గాసిప్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? లేక కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనా? అన్నది వీరిద్దరి రియాక్షన్ రాకముందు చెప్పలేం.