LOADING...
Meenakshi Chaudhary : 'భాగమ్ భాగ్' సీక్వెల్‌లో మీనాక్షి హీరోయిన్‌గా ఫిక్స్?
'భాగమ్ భాగ్' సీక్వెల్‌లో మీనాక్షి హీరోయిన్‌గా ఫిక్స్?

Meenakshi Chaudhary : 'భాగమ్ భాగ్' సీక్వెల్‌లో మీనాక్షి హీరోయిన్‌గా ఫిక్స్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ సంక్రాంతికి విడుదలైన 'అనగనగ ఒక రాజు' చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు నేరుగా బాలీవుడ్ 'కిలాడీ' అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషంగా మారింది. 2006లో సంచలన విజయం సాధించిన కామెడీ థ్రిల్లర్ 'భగమ్ భాగ్' సీక్వెల్‌లో మీనాక్షి కథానాయికగా నటించనుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు రూపొందించనున్న సీక్వెల్‌కు దర్శకత్వ బాధ్యతలను రాజ్ షాండిల్యకు అప్పగించినట్లు సమాచారం.

Details

మరో హీరోయిన్‌గా అయేషా ఖాన్

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరితో పాటు, ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న అయేషా ఖాన్ మరో హీరోయిన్‌గా కనిపించనుందట. ఇక మీనాక్షి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన వృషకర్మ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. దక్షిణాదిలో టాప్ హీరోలతో వరుస అవకాశాలు దక్కించుకుంటూనే, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారనుంది. ఈ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. కామెడీ టైమింగ్‌కు పేరుగాంచిన ఈ ఫ్రాంచైజ్‌లో మీనాక్షి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Advertisement