LOADING...
Mega 158 : నేటి నుంచి పొల్లాచ్చిలో మెగా158 షూటింగ్.. చిరుపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
నేటి నుంచి పొల్లాచ్చిలో మెగా158 షూటింగ్.. చిరుపై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Mega 158 : నేటి నుంచి పొల్లాచ్చిలో మెగా158 షూటింగ్.. చిరుపై కీలక సన్నివేశాల చిత్రీకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ (K. S. Ravindra (Bobby)) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా158'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్రబృందం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. సినిమా తొలి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తమిళనాడులోని పొల్లాచికి చేరుకుంది. సోమవారం నుంచి అక్కడ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది.

వివరాలు

అందమైన లొకేషన్లలో ప్లాన్

దాదాపు 15 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్‌ను పొల్లాచి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను దర్శకుడు బాబీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. పొల్లాచి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడికి చేరుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సంగీత బాధ్యతలను మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.థమన్ నిర్వహిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ నుంచే వేగం పెంచడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

వివరాలు

కీలక పాత్రలో నారా రోహిత్

ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ యువ హీరో నారా రోహిత్, మలయాళ నటి నివేత పెతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో 'మెగా158'పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement