తదుపరి వార్తా కథనం
వరుణ్ తేజ్ కొత్త సినిమా పేరు ఖరారు.. దేశంలోనే అతిపెద్ద వైమానిక యాక్షన్ మూవీ
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Aug 14, 2023
04:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హిరో వరుణ్ తేజ్ కొత్త సినిమా (13వ చిత్రం) పేరు ఖరారైంది. సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నారు.
వైమానిక దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ కథకు ఆపరేషన్ వాలెంటైన్ అనే టైటిల్ ఒకే అయ్యింది.
ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద వైమానిక యాక్షన్ దృశ్యాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఐఏఎఫ్(IAF) అధికారి పాత్రలో మెరవనున్న వరుణ్ కు జోడీగా మానుషి చిల్లార్ ఆకట్టుకోనుంది.
తెలుగులో చిల్లార్ కి ఆపరేషన్ వాలెంటైన్ తొలి సినిమా కానుంది.డిసెంబర్ 8న తెలుగు,హిందీ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.